- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేతులు మారిన శింబు క్రేజీ ప్రాజెక్ట్?
శింబు నెక్స్ట్ మూవీ మైత్రి మూవీ మేకర్స్ నుంచి సితారా ఎంటర్టైన్మెంట్స్ చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: కొన్ని సంవత్సరాల క్రితం అద్భుతమైన జోష్‌లో కెరీర్‌ను కొనసాగించిన శింబు, ఆ తర్వాత వరుస అపజయాలతో కొంతకాలం వెనుకబడ్డాడు. అయితే ‘మానాడు’ చిత్రంతో ఆయన బలమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. కానీ ఆ విజయానంతరం మళ్లీ వరుసగా పరాజయాలు ఎదురవడంతో ఇప్పుడు మరోసారి భారీ కమ్‌బ్యాక్ కోసం శింబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో డ్యూడ్ ఫేమ్ కీర్తీశ్వరన్ దర్శకత్వంలో ఒక కొత్త సినిమాకు ఆయన కమిట్ అయినట్లు సమాచారం. ప్రారంభంలో ఈ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారని వార్తలు వచ్చాయి.
అయితే చివరి నిమిషంలో ఆ సంస్థ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ఇప్పుడు ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ‘డ్యూడ్’ లాంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన కీర్తీశ్వరన్‌తో శింబు చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ద్వారా శింబు మరోసారి సక్సెస్ ట్రాక్‌లోకి తిరిగి వస్తాడని సినీ వర్గాలు భావిస్తున్నాయి.






