- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు ఫ్యాన్స్‌పై సాగరకన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఇప్పుడు కూడా ఇదే లవ్ ఇవ్వాలంటూ
కన్నడ స్టార్ ధృవ సర్జా హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కేడీ: ది డెవిల్’.

దిశ, సినిమా: కన్నడ స్టార్ ధృవ సర్జా హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కేడీ: ది డెవిల్’. వయోలెంట్ అండ్ ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో రేష్మ నానయ్య హీరోయిన్ కాగా.. శిల్పా శెట్టి, సంజయ్ దత్, రమేశ్ అరవింద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి ప్రేమ్ దర్శకత్వం వహించాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధం అవుతుండగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ ఈవెంట్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన శిల్పాశెట్టి ఈ సందర్భంగా ఫ్యాన్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
‘రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాను. హైదరాబాద్ నుంచి అప్పుడు నాకు చాలా లవ్ ఇచ్చారు ఫ్యాన్స్. ఇప్పుడు కూడా మీరు నాకు అంతే లవ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అప్పటి నుంచి నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్న తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు ఈ కేడీ చిత్రంతో కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాలి. ఈ సినిమాలో నన్ను తీసుకున్నందుకు దర్శకుడు ప్రేమ్‌కు ధన్యవాదాలు. నేను ఈ సినిమాలో సత్యవతి అనే పాత్రలో కనిపిస్తాను. ఈ టీమ్‌తో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఫైనల్‌గా సంజుకు (సంజయ్ దత్) స్పెషల్ థాంక్యూ. ఆయన ప్రతీ సినిమాకు ట్రెండ్ సెట్ చేస్తారు.. ఇప్పుడు కూడా కొత్త ట్రెండ్ సెట్ చేయాలని కోరుకుంటున్నా’ అని తెలిపింది.






