- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆమె నాకు ఫ్యామిలీతో సమానం.. యంగ్ బ్యూటీపై సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) మనందరికీ సుపరిచితమే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్‌ని ఎంచుకుంటూ ప్రజెంట్ హీరోగా రాణిస్తున్నాడు. అయితే ‘ప్రస్థానం’ మూవీలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆ తర్వాత మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో నటించిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆశించిన హిట్లు దక్కకపోవడంతో కెరీర్‌లో కాస్త వెనకబడ్డాడు. మధ్య మధ్యన కొన్ని హిట్లు దక్కినప్పటికీ సక్సెస్ గ్రాఫ్ స్థిరంగా లేదు. ఇక రీసెంట్‌గా ‘మజాకా’ మూవీతో మనముందుకు వచ్చి మంచి విజయం సాధించాడు. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉంటే.. సందీప్ కిషన్- రెజీనా కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే ఆ టైంలో వీరిద్దరి మధ్య స్నేహం చిగురించి అది కాస్త ప్రేమగా మారిందని అప్పటినుంచి వాళ్లు డేటింగ్‌లో ఉన్నారని అప్పట్లో ఎన్నో పుకార్లు నెట్టింట షికార్లు చేశాయి. ఈ క్రమంలో తాజాగా సందీప్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ మాట్లాడుతూ.. ‘నేను ఇల్లు కొనుక్కునేటప్పుడు అమౌంట్ తగ్గితే నేను అడగకుండానే రెజీనా వెంటనే రూ.5లక్షలు పంపించింది. ఆమె నాకు ఫ్యామిలీతో సమానం. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్.. మేము కొట్టుకున్నంతగా ఎవరూ కొట్టుకొని ఉండరు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..






