- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇంట్లో శోభితని ఆ పేరుతోనే పిలుస్తుంటా’.. అక్కినేని నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’(Thandel).

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’(Thandel). చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్(Geetha Arts Banner)పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మిస్తున్నారు. యథార్థ ప్రేమ సంఘటన కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం లవర్స్ కానుకగా ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
అయితే విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్ల జోరు పెంచింది. ఇందులో భాగంగా తాజాగా హైద్రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్(Pr-Release Event)ను నిర్వహించారు మేకర్స్. అయితే ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) అతిథిగా విచ్చేశారు. ఇక ఈ ఈవెంట్‌లో నాగ చైతన్య తన భార్య శోభిత ధూళిపాళ(Shobhita Dhulipala) గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఆయన మాట్లాడుతూ.. ‘ఇంట్లో శోభితను బుజ్జి తల్లి అనే పిలుస్తాను. ఈ సినిమాలో హీరోయిన్‌ని కూడా అలాగే పిలుస్తుంటా’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా సమంత(Samantha)తో విడాకుల తర్వాత నాగ చైతన్య స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్‌లో ఉన్నాడు. వీరిద్దరు కలిసి వేకెషన్స్‌కి వెళ్లినవి, హోటల్‌లో ఉన్న ఫొటోలు మీడియాకి చిక్కాయి.
అయినప్పటికీ వీరు తమ రిలేషన్ షిప్ గురించి ఏమీ మాట్లాడకుండా సడెన్‌గా ఎంగేజ్‌మెంట్(engagement) చేసుకుని షాక్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి నెట్టింట వీరికి సంబంధించిన న్యూస్ ఏదో ఒక విధంగా వైరల్ అవుతునే ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరు డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇక మ్యారేజ్ తర్వాత చైతన్య సినిమాలు చేస్తుంటే, శోభిత మాత్రం సోషల్ మీడియా(Social Media)లో నిత్యం లేటెస్ట్ ఫొటోలతో అభిమానులకు దగ్గరవుతూ ఉంది.






