మొత్తానికి ఆ పని పూర్తి చేసిన శర్వానంద్.. ఫొటోలు వైరల్

by Sujitha Rachapalli |

చార్మింగ్ స్టార్ శర్వా హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవ్వులు, భావోద్వేగాలు, ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా కలయికలో పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీ కానుంది. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర

మొత్తానికి ఆ పని పూర్తి చేసిన శర్వానంద్.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా : చార్మింగ్ స్టార్ శర్వా హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవ్వులు, భావోద్వేగాలు, ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా కలయికలో పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీ కానుంది. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య మహిళా కథానాయికలుగా నటించారు. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ రాగా తాజగా ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. ఇందుకు సంబంధించిన పిక్ రిలీజ్ చేసిన మేకర్స్.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం సమకూరుస్తున్న చిత్రానికి సినిమాటోగ్రఫీని జ్ఞాన శేఖర్ విఎస్, యువరాజ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. కథను భాను బోగవరపు రాయగా.. నందు సావిరిగణ సంభాషణలు అందిస్తున్నారు. అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. కిషోర్ గరికిపాటి ఈ ప్రాజెక్టుకు ఎగ్జిక్యూటివ్ నిర్మాత. కాగా ఈ సినిమా జనవరి 14వ తేదీన సాయంత్రం 5:49 గంటలకు ఫస్ట్ షోతో థియేటర్లలో విడుదల కానుంది.

Next Story