ప్రేక్షకులకు ‘శంబాల’ సర్‌ప్రైజ్

by Sujitha Rachapalli |

వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలోనే

దిశ, సినిమా : వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. మంచు మనోజ్, కిరణ్ అబ్బవరం, ప్రియదర్శి, థమన్, అనిల్ రావిపూడి, నవీన్ యెర్నెని, టీజీ విశ్వ ప్రసాద్, అశ్విన్ బాబు, మైత్రి శశి వంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘శంబాల’ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. సైన్స్ గొప్పదా? శాస్త్రం గొప్పదా? అంటూ సాగే ట్రైలర్ మంచి పాజిటివ్ వైబ్ ఇచ్చిందని.. 14 ఏళ్లుగా ఎదురుచూస్తున్న సక్సెస్ ఆదికి దక్కుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో ఆది సాయి కుమార్.. ‘గత ఏడాది డిసెంబర్‌లో ‘శంబాల’ ఫస్ట్ పోస్టర్‌ నుంచి.. నా ఈ ప్రయాణంలో మీడియా, ఆడియన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే వచ్చారు. యుగంధర్ ముని అద్భుతంగా తీశాడు కాబట్టే ఈ రోజు చిత్రంపై హైప్ ఏర్పడింది. దర్శక, నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని రూపొందించారు. ప్రవీణ్ విజువల్స్, శ్రీచరణ్ ఆర్ఆర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుంది. థియేటర్లో అందరూ మా మూవీని చూసి సర్ ప్రైజ్ అవుతారు. డిసెంబర్ 25న హిట్టు కొట్టబోతున్నాం’ అని ధీమా వ్యక్తం చేశారు.

Next Story