‘శంబాల’తో హిట్టు కొట్టబోతున్నాం..

by Sujitha Rachapalli |

వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. డిఫరెంట్ హారర్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. అర్చన అయ్యర్

‘శంబాల’తో హిట్టు కొట్టబోతున్నాం..
X

దిశ, సినిమా : వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. డిఫరెంట్ హారర్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుండగా.. నిర్మాతలు చిత్ర విశేషాలు పంచుకున్నారు.

‘కథ బాగా నచ్చడంతో డివోషనల్, హారర్ ఎలిమెంట్స్ కావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. ముందుగా ఆది సాయి కుమార్‌తో వేరే కథ అనుకున్నాం. కానీ ఇంతలో ఈ స్టోరీ రావడంతో ఆయనతోనే ఈ మూవీ కంప్లీట్ చేశాం. మొదట కొంచెం బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ ఆ తర్వాత బడ్జెట్ పెంచి హై క్వాలిటీతో మూవీ తీశాం. ఈ స్టోరీ బాగా వర్కవుట్ అవుతుందని నమ్మి ఇన్వెస్ట్ చేశాము. అనుకున్నట్లుగానే ఇప్పటికే జరిగిన బిజినెస్‌తో సేఫ్ జోన్ లోకి వచ్చాము. శాటిలైట్, ఓటీటీ రైట్స్ ద్వారా 80 శాతం రికవరీ వచ్చేసింది. ఇంకో 20 శాతం రికవరీ బ్యాలెన్స్ అంతే. థియేట్రికల్ రన్‌తో లాభాల్లోకి వస్తామని నమ్ముతున్నాం. హిందీ థియేట్రికల్ రిలీజ్ కూడా ప్లాన్ చేశాం. తెలుగులో రిలీజ్ అయిన వారం రోజుల్లో హిందీ రిలీజ్ ఉంటుంది. మా సినిమాలో హారర్‌తో పాటు సస్పెన్స్, ఎమోషన్స్ కలిపి ఉంటాయి. మైత్రి మూవీ మేకర్స్ మా సినిమాను రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా పాజిటివ్. హీరో, హీరోయిన్స్‌తో పాటు సినిమాలో అన్ని క్యారెక్టర్స్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ అయితే ప్రాపర్ గా ఎండ్ చేశాము. సెకండ్ పార్ట్ కోసం స్మాల్ లీడ్ ఇచ్చాము. కొంచెం క్యూరియాసిటీ ఉండేలా క్లోజ్ చేశాము. దాని గురించి మళ్లీ ఆలోచిస్తాం’ అని తెలిపారు.

Next Story