Shalini Pandey: ‘మీరా’గా శాలినీ పాండే.. ఆకట్టుకుంటోన్న పోస్టర్

by Chukka Sudharani |

ధనుష్, నిత్యా మీనన్ కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ మూవీ ‘ఇడ్లీ కడై’.

Shalini Pandey: ‘మీరా’గా శాలినీ పాండే.. ఆకట్టుకుంటోన్న పోస్టర్
X

దిశ, సినిమా: ధనుష్ (Dhanush), నిత్యా మీనన్ (Nithya Menon) కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ మూవీ ‘ఇడ్లీ కడై’. ధనుష్ స్వీయ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ శాలినీ పాండే ఓ కీలక పాత్రలో నటిస్తు్న్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇడ్లీ కడైలో నటిస్తున్న నటీనటుల పాత్రలకు సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఇందులో శాలినీ పాండే ‘మీరా’ అనే పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు టీమ్. ఇక ఇప్పటికే సత్యరాజ్, నిత్యా మీనన్ పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ రిలీజై మంచి స్పందన దక్కించుకోగా.. ప్రజెంట్ శాలిని పోస్టర్ కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. కాగా.. అక్టోబర్ 1 గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఈ సినిమాలో పార్తిబన్, సుమతిరకని, రాజ్ కిరణ్, అరుణ్ విజయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. లింక్


Next Story