సునామీ వచ్చేస్తున్నది.. సిద్ధంగా ఉన్నారా.. కింగ్ నుంచి అదిరిపోయే అప్డేట్

by Chukka Sudharani |

బాలీవుడ్ బాద్ షారుఖ్ ఖాన్ ‘కింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ టీజర్ రిలీజ్ చేశారు.

సునామీ వచ్చేస్తున్నది.. సిద్ధంగా ఉన్నారా.. కింగ్ నుంచి అదిరిపోయే అప్డేట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కింగ్’. ‘పఠాన్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే.. షూటింగ్ షెడ్యూల్ ఆలస్యం కారణంగా ఈ సినిమా క్రిస్మస్ బరిలో ఉండదు అంటూ గత కొద్ది రోజులుగా నెట్టింట వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా రిలీజ్‌పై క్లారిటీ ఇస్తూ అభిమానుల కోసం అదిరిపోయే టీజర్ వదిలారు మేకర్స్.

‘రాజ్యాన్ని కదిలించేంతటి గర్జన.. కింగ్ డిసెంబర్ 24న వస్తున్నాడు.. ఇది కింగ్ టైం.. సునామీ మీ ముందుకు వచ్చేస్తున్నది.. మీరంతా సిద్ధంగా ఉన్నారా..?’ అంటూ రిలీజ్ చేసిన పవర్ ఫుల్ టీజర్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా.. కింగ్ చిత్రం ఖాన్ కుటుంబానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా కూడా నిలుస్తుంది. ఎందుకంటే సుహానాఖాన్ తన తండ్రితో కలిసి తొలిసారిగా బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు, సినిమా లవర్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Next Story