OG నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్.. పెళ్లి చేసుకునే జంటలకు బెస్ట్ బ్యాగ్రౌండ్ మెలోడీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-18 14:18:37  IST  )

సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్- ప్రియాంగ మోహన్ జంటగా నటిస్తోన్న సినిమా OG.

OG నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్.. పెళ్లి చేసుకునే జంటలకు బెస్ట్ బ్యాగ్రౌండ్ మెలోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్- ప్రియాంగ మోహన్ జంటగా నటిస్తోన్న సినిమా OG. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. హరిహర వీరమల్లు దెబ్బ నుంచి ఈ సినిమా కోలుకునేలా చేస్తుందని నమ్ముతున్నారు. ఇప్పటికే OG నుంచి రిలీజైన గ్లింప్స్, సాంగ్, పవన్ లుక్స్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి.

వినాయకచవితి సందర్భంగా OGనుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట చాలా మెలోడీగా ఉంది. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చగా.. శృతి రంజని పాటను ఆలపించింది. కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. 90's బ్యాక్ డ్రాప్ లో పాటను చిత్రీకరించారు. సువ్వి సువ్వి అంటూ సాగే పాటను వింటుంటే.. కొత్తగా పెళ్లిచేసుకునే జంటలకు తమ వీడియో ఆల్బమ్స్ కు మరో మంచి మెలోడీ సాంగ్ దొరికినట్లే అనిపిస్తుంది. ఇక OG సినిమా సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అదేరోజున బాలయ్య నటిస్తోన్న అఖండ -2 సినిమా కూడా రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. రెండు సినిమాల మధ్య పోటీ గట్టిగానే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

Next Story