మాస్ జాతర నుంచి సెకెండ్ సింగిల్ అప్‌డేట్.. పోస్టర్‌తోనే క్యూరియాసిటీ పెంచేశారుగా..

by I. Sairam |

మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) హీరోగా శ్రీ లీల(Sreeleela) హీరోయిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’(Mass Jathara).

మాస్ జాతర నుంచి సెకెండ్ సింగిల్ అప్‌డేట్.. పోస్టర్‌తోనే క్యూరియాసిటీ పెంచేశారుగా..
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) హీరోగా శ్రీ లీల(Sreeleela) హీరోయిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’(Mass Jathara). ఇక దీన్ని దర్శకుడు భాను బోగవరపు(Bhanu Bhogavarapu) తెరకెక్కిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య(Sai Sowjanya) భారీగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ అవైటెడ్ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుకుంటూ పోయింది.

ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి సెకెండ్ సింగిల్ ఓలే ఓలే సాంగ్ ప్రోమో రేపు ఉదయం 11 గంటల 8నిమిషాలకు, ఫుల్ లిరికల్ సాంగ్ ఆగస్టు 5న రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో రవితేజను శ్రీలీల పట్టుకుని షాక్ అవుతున్నట్లు చూస్తుంటే రవితేజ మాత్రం చాలా హ్యాపీగా చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సాంగ్ పై మరింత క్యూరియాసిటీ పెంచేసింది. కాగా ఈ మూవీ ఆగస్టు 27న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. Link

Next Story