సత్య 'జెట్లీ' విడుదల తేదీ వచ్చేసింది

by Pulgam srinivas |

జెట్లీ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సత్య జెట్లీ విడుదల తేదీ వచ్చేసింది
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ కమెడియన్ సత్య ప్రస్తుతం హీరోగా నటిస్తున్న చిత్రం ‘జెట్లీ’. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో సత్యతో పాటు వెన్నెల కిషోర్ కూడా కనిపించడం విశేషం.ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.దర్శకుడు రీతీష్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రియా సింఘా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే అజయ్, హర్ష చెముడు, కబీర్ దుహన్ సింగ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.





Next Story