ధనుష్ 56 చిత్రంపై లేటెస్ట్ బజ్.. రుక్మిణి ప్లేస్‌లో మరో యంగ్ క్రేజియస్ట్ బ్యూటీ!

by Chukka Sudharani |

ధనుష్ 56 ప్రాజెక్టు కోసం ఫీమేల్ లీడ్‌లో కీలక మార్పులు చేశారు మేకర్స్.

ధనుష్ 56 చిత్రంపై లేటెస్ట్ బజ్.. రుక్మిణి ప్లేస్‌లో మరో యంగ్ క్రేజియస్ట్ బ్యూటీ!
X

దిశ, సినిమా: విభిన్న కథలతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు ధనుష్. ఆయన గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నాడు. అలాగే ప్రస్తుతం ఈ హీరో తన 56వ చిత్రంపై కూడా ఫోకస్ పెట్టినట్లు టాక్. తమిళ దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడని తెలుస్తుండగా.. ఇందులో ఫీ మేల్ లీడ్ కోసం రుక్మిణి వసంత్‌ను ఓకే చేసినట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

‘కాంతార’, ‘ఏస్’, ‘మదరాసి’ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ ప్రస్తుతం చేతులో వరుస ప్రాజెక్టులు పెట్టుకుని బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే ధనుష్ 56వ చిత్రానికి గాను డేట్ సమస్యల కారణంగా ఈ మూవీ నుంచి రుక్మిణిని తప్పించినట్లు టాక్. అలాగే ధనుష్ సరసన హీరోయిన్‌గా సారా అర్జున్‌ను లైన్‌లో పెట్టారట మేకర్స్. టాక్స్ ఫైనల్ అయితే.. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం.

Next Story