- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి రాకముందే టీవిల్లోకి వచ్చేస్తున్న సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ.. ఎప్పుడంటే
విక్టరీ వెంకటేష్(Venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam).

దిశ, వెబ్‌డెస్క్: విక్టరీ వెంకటేష్(Venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam). ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(SVC) బ్యానర్ పై నిర్మాతలు దిల్ రాజు(Dil Raju), శిరీష్(Shirish) రూపొందించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌లో వీకే నరేష్(VK Naresh), వీటి గణేష్(VT Ganesh), సాయి కుమార్(Sai Kumar), పమ్మి సాయి(Pammi Sai), సర్వదమన్ బెనర్జీ(Sarwadam Banerjee) తదితరులు నటించారు.
అయితే ఈ చిత్రం సంక్రాంతి(Pongal) కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ అయి స్టార్టింగ్ డే నుంచి కలెక్షన్ల విషయంలో బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబట్టింది. వెంకీమామ లైఫ్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ మూవీ రికార్డుకెక్కింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సంక్రాంతికి వస్తున్నాం మూవీ టీవీల్లో రిలీజ్‌కు సిద్ధమైంది. మార్చి ఫస్ట్ తేదీన జీ తెలుగులో ప్రసారం కానుందని జీ తెలుగు అఫీషియల్‌గా ప్రకటించింది. అనగా వచ్చే శనివారం సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ప్రసారం కానుంది.
అయితే ఇండస్ట్రీ చరిత్రలో ఈ మూవీ ఓటీటీలోకి రిలీజ్ కాకముందే టీవిల్లోకి రానుండటం విశేషం. కాగా సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు. ఇక విక్టరీ వెంకటేష్ గురించి చెప్పాలంటే ఫ్యామిలీ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సంక్రాంతికి ఏ హీరో సినిమా రిలీజ్ అయినా అందులో పక్కా హిట్ కొట్టేది వెంకీ మామనే అన్నట్లు ఫేమస్ అయ్యాడు. అలా ఎఫ్1, ఎఫ్2 వంటి సినిమాలతో మంచి విజయం సాధించాడు. సినిమాల పరంగానే కాకుండా రియల్ లైఫ్‌లో ఎటువంటి రూమర్స్ లేకుండా మంచి హీరోగా రాణిస్తున్నాడు.






