- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టేజ్ పైనే లేడీ చున్నీ లాగిన టాలీవుడ్ హీరో!
ఓ ఈవెంట్ కు వెళ్లిన హీరో సంగీత్ శోభన్, లేడీ డైరెక్టర్ మానస శర్మ చున్నీతో తన కళ్లద్దాలు తుడుచుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పెద్ద హీరోలవి కొన్ని సినిమాలు ఉంటే.. మరికొంతమంది చిన్న హీరోలు కూడా డిఫరెంట్ కథలతో వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంగీత శోభన్... రాకాస అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తుండగా నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో సంగీత శోభన్ సరసన నయన్ సారిక హీరోయిన్ గా చేస్తున్నారు. ఇక ఈ మూవీలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి లాంటి కీలకమైన వాళ్లు ఉన్నారు. ఏప్రిల్ మూడవ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో దూసుకు వెళ్తోంది చిత్ర బృందం.
లేడీ డైరెక్టర్ మానస శర్మ చున్నీతోనే ఏకంగా!
అయితే ఈ సందర్భంగా హీరో సంగీత్ శోభన్ స్టేజ్ పైన చేసిన పని వైరల్ గా మారింది. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఈవెంట్ కు వెళ్లిన హీరో సంగీత్ శోభన్, లేడీ డైరెక్టర్ మానస శర్మ చున్నీతో తన కళ్లద్దాలు తుడుచుకున్నాడు. ఆమెను నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే సంగీత శోభన్ ఈ పని చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో అమ్మాయిల చున్ని పట్టుకునే ముందు పర్మిషన్ తీసుకోవాలని హీరోకు కౌంటర్ ఇస్తున్నారు నెటిజన్స్. లేడీ డైరెక్టర్ మానస శర్మ మంచి వ్యక్తి కాబట్టి సైలెంట్ గా ఉన్నారు.. వేరే మహిళ అయితే కచ్చితంగా ఈ సంఘటన వివాదంగా మారేదని మరికొంతమంది వాదిస్తున్నారు.






