Sandeep Reddy Vanga : ప్రభాస్ స్పిరిట్ స్టోరీ లీక్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. ఇది కదా మాకు కావాల్సింది అంటున్న ఫ్యాన్స్

by Chukka Sudharani |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్‌కమింగ్ మూవీస్‌లో స్పిరిట్ ఒకటి.

Sandeep Reddy Vanga : ప్రభాస్ స్పిరిట్ స్టోరీ లీక్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. ఇది కదా మాకు కావాల్సింది అంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్‌కమింగ్ మూవీస్‌లో స్పిరిట్ ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ చివర్లో స్టార్ట్ కాబోతున్నట్లు ఇప్పటికే అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్. అయితే.. ‘స్పిరిట్’ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా స్టోరీపై నెట్టింట పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది డార్క్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని క్రైమ్ థ్రిల్లర్ అంటూ వార్తలు వస్తున్న క్రమంలో రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరోసారి ప్రభాస్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు.

ఇది సూపర్ నేచురల్ థ్రిల్లర్ కాదు.. కంప్లీట్‌గా ఒక ఇంటెన్స్ పోలీస్ డ్రామా. ఇందులో ప్రభాస్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు అని చెప్పకనే చెప్పేశాడు సందీప్. ప్రజెంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఇది కదా మాకు కావాల్సింది అంటూ కామెంట్స్‌తో రచ్చ చేస్తున్నారు. కాగా.. ఈ మూవీ కోసం ప్రభాస్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. అలాగే.. యవ్వనంగా కనిపించడానికి చాలా బరువు తగ్గబోతున్నాడని తెలుస్తుంది. ఇక ఈ మూవీలో త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా.. వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Next Story