- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పిరిట్‌తో ఆ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన సందీప్ రెడ్డి
సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' చిత్రాన్ని Gen Z మరియు Alpha Gen వారిని దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన అతి కొద్ది మంది దర్శకులలో సందీప్ రెడ్డి వంగా ఒకరు. ఈ దర్శకుడు ఇప్పటివరకు తక్కువ సినిమాలకు దర్శకత్వం వహించినా భారీ స్థాయి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం సందీప్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న స్పిరిట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సందీప్ దర్శకత్వంలో రూపొందే సినిమాలు ఎక్కువ శాతం యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. గతంలో ఆయన రూపొందించిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలు కూడా యూత్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇకపోతే స్పిరిట్ చిత్రాన్ని ఈయన Gen Z మరియు Alpha Gen వారిని దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్నట్లు, వారికి ఈ సినిమా అద్భుతంగా నచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎక్కువ శాతం సినిమాలను ఆ జనరేషన్ వారే చూస్తూ ఉంటారు. దాంతో వారికి కాస్త సినిమా నచ్చినా అది బాక్సాఫీస్ దగ్గర రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ కనిపించనుండగా, వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ మరియు టి-సిరీస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.






