Sandeep Kishan: పగిలిపోయేటట్టు అంటున్న సందీప్ కిషన్.. మాస్ బీట్‌తో ఊర మాస్ డ్యాన్స్

by Chukka Sudharani |   (  Updated:2025-12-23 15:35:31  IST  )

Sandeep Kishan: పగిలిపోయేటట్టు అంటున్న సందీప్ కిషన్.. మాస్ బీట్‌తో ఊర మాస్ డ్యాన్స్
X

దిశ, సినిమా: యంగ్ హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan), డైరెక్టర్ త్రినాధరావు (Trinadha Rao) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మజాకా’ (Mazaka). ఎ కె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైన్మెంట్ చిత్రంలో.. రీతు వర్మ (Ritu Verma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ యాక్టర్స్ రావు రామేష్ (Rao Ramesh), అన్షు (Anshu) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ‘మజాకా’ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి అప్‌డేట్‌కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ రాగా.. ప్రేక్షకుల్లో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈ చిత్రం శివరాత్రి స్పెషల్‌గా ఫిబ్రవరి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది.

రిలీజ్ సమయం దగ్గర పడటంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. తాజాగా థర్డ్ సింగిల్ (third single) రిలీజ్ చేశారు. ‘హే పగిలి పగిలి.. పగిలి పోయేటట్టు డీజేలే పెట్టించేద్దామా.. పగలే చుక్కలు తెచ్చి డిస్కోలే ఆడించేద్దామా’ అంటూ సాగే ఈ సాంగ్‌లో మాస్ బీట్‌తో ఊర మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు సందీప్ కిషన్ అండ్ రీతు వర్మ. ప్రజెంట్ ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బ్లాక్ బస్టర్ హిట్ అని సందీప్ అన్నా లుక్ సూపరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Next Story