Samantha: ఇది జన్మజన్మల బంధం అంటూ సమంత మరో ట్వీట్.. వైరల్‌గా సాంగ్

by Chukka Sudharani |   (  Updated:2025-08-15 17:38:48  IST  )

హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం నిర్మాతగా మారిన విషయం తెలిసిందే.

Samantha: ఇది జన్మజన్మల బంధం అంటూ సమంత మరో ట్వీట్.. వైరల్‌గా సాంగ్
X

దిశ, సినిమా: హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఆమె స్టార్ట్ చేసిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘శుభం’ (Shubham). ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మే 9న గ్రాంగ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘శుభం’ నుంచి ‘జన్మ జన్మల బంధం’ (Janma Janmala Bandham) అంటూ సాగే పాట ఫుల్ సాంగ్ (Full song) రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ముగ్గురు జంటలు ముచ్చటగా స్టెప్పులు వేస్తుండగా.. మధ్యలో సమంత కూడా జాయిన్ అయ్యి డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. ఈ సాంగ్‌ను హీరోయిన్ సమంత తన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. ‘మేము చేసిన దానికంటే మీరు దీన్ని చాలా బాగా చేస్తారు. నీ దగ్గర ఉన్న విషయాన్ని మాకు చూపించండి’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసింది. ప్రజెంట్ ఈ సాంగ్ లిరిక్స్ సోషల్ మీడియా వేదికగా.. నెటిజన్‌లను ఆకట్టుకుంటుంది.

Next Story