- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samantha: పెళ్లితో ఒక్కటైన చైతన్య, శోభిత.. వాట్ ఎ జర్నీ అంటూ ఫొటోస్ షేర్ చేసిన సమంత
గత రాత్రి అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya)- శోభిత ధూళిపాళ్ల (Shobitha Dhulipalla) మూడు ముళ్ల బంధంతో ఒక్కటయిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: గత రాత్రి అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya)- శోభిత ధూళిపాళ్ల (Shobitha Dhulipalla) మూడు ముళ్ల బంధంతో ఒక్కటయిన విషయం తెలిసిందే. గత కొద్ద కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట తాజాగా పెద్దల సమక్షంలో వివాహబంధంలోకి అడుగు పెట్టారు. బుధవారం అన్నపూర్ణ స్టూడియో (Annapurna Studio)లో వీరి మ్యారేజ్ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి అక్కనేని, దగ్గుబాటి, శోభిత ఫ్యామీలీలు హాజరయ్యాయి. అట్టహాసంగా జరిగిన ఈ మ్యారేజీకి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో పాటు మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ సినీ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి (T. Subbarami Reddy), విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), అల్లు అరవింద్ (Allu Aravind), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) సహా పలువురు సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజెంట్ వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు నెటిజన్లు శుభకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత ఇన్‌స్టాస్టోరీ వైరల్‌గా మారింది.
అయితే.. సమంత (Samantha) రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel: Honey Bunny) వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వరుణ్ ధావన్ (Varun Dhawan) హీరోగా నటించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ మంచి మార్కులు సొంతం చేసుకుంటోంది. ఇందులో భాగంగా.. సిటాడెల్ జర్నీని తలుచ్చుకుంటూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది సామ్. ఈ మేరకు ‘వాట్ ఎ జర్నీ.. సిటాడెల్‌లో పని చేయడం చాలా గౌరవం. డైరెక్టర్ rajandDK తో హనీ బన్నీ జర్నీ మరింత నమ్మశక్యంగా మారింది’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్ షేర్ చేసింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.






