Samantha: దుమారం రేపుతున్న సమంత పోస్ట్.. పాకిస్తాన్‌కు సపోర్ట్ చేయడంతో నెటిజన్లు ఫైర్!

by Mallepaka Hamsa |   (  Updated:2025-04-25 12:16:02  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)గత కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది.

Samantha: దుమారం రేపుతున్న సమంత పోస్ట్.. పాకిస్తాన్‌కు సపోర్ట్ చేయడంతో నెటిజన్లు ఫైర్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)గత కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. మయోసైటీస్ వ్యాధి బారిన పడిన ఆమె చివరగా ‘ఖుషి’ మూవీలో కనిపించింది. ఇక గత కొద్ది రోజుల నుంచి ఓ పాడ్ కాస్ట్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలుపుతూ వార్తల్లో నిలుస్తోంది. ఈ అమ్మడు ఇటీవల నిర్మాతగా మారి ‘శుభం’(shubham) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 9న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, సమంత ఓ పోస్ట్ ద్వారా నెట్టింట ట్రోలింగ్‌కు గురవుతోంది. అసలు విషయంలోకి వెళితే.. జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఏకంగా 26 మంది అమాయకపు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఈ ఘటనపై యావత్ భారతదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాకిస్తాన్‌పై ఎదురు దాడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ దాడిలో ఉగ్రవాదులు మృతి చెందిన వారిని మతం అడిగి మరీ చంపడం గమనార్హం. హిందువులను మాత్రమే దారుణంగా కాల్చడం భారతీయులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే పాకిస్తాన్ వల్లే ఇదంతా చేశారని నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనూ భారత్ సింధు నదిలో ఇచ్చే వాటాలను నిలిపివేసింది. ఇక ఈ విషయంపై సమంత ఇండైరెక్ట్‌గా పోస్ట్ పెట్టి ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ఆమె ఉద్దేశం ఏంటో తెలియనప్పటికీ ఆమె పెట్టిన పోస్ట్ సిచ్యువేషన్‌కు కనెక్ట్ కావడంతో అంతా పాకిస్తాన్‌కు సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టిందని మండిపడుతున్నారు.

అసలు అందులో ఏముందంటే.. ‘‘సముద్రాలు నీళ్లు తాగలేవు.. చెట్లు తమ పండ్లను తినలేవు.. సూర్యుడుతన కాంతిని చూడలేడు. పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవు. ప్రకృతి కోసం జీవించండి. మనమందరం కూడా ఒకరికి ఒకరి సాయం చేసుకోవడానికి భూమి మీ ద పుట్టాం. కాబట్టి అందరి కోసం జీవిస్తూ సంతోషంగా ఉంటావు’’ అని రాసి ఉన్న కొటేషన్ పెట్టింది. అయితే ఈ కొటేషన్ భారత్ సింధు జలాలను ఆపేసిన క్రమంలోనూ చేయడంతో నెట్టింట దుమారం రేపుతోంది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు దారుణంగా మాట్లాడుతున్నారు. అంత హెల్పింగ్ నేచర్ ఉంటే పాకిస్తాన్‌కు వెళ్లు అని తిట్టిపోస్తున్నారు.

Next Story