- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రెగ్నెన్సీలో వర్కౌట్స్..సమంత వీడియో వైరల్ !
జిమ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియో పంచుకున్నారు సమంత.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 18 సంవత్సరాలుగా ఇండస్ట్రీని ఆమె ఏలుతున్నారు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సమంత... అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి చూసుకోలేదు. ఇక ఈ మధ్యే రెండో పెళ్లి చేసుకున్న సమంత... వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. రెండో పెళ్లి చేసుకుని ఏడాది తిరగకముందే గుడ్ న్యూస్ చెప్పింది సామ్. మా ఇంటి బంగారం ప్రమోషన్స్ సమయంలో తాను ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించారు.
అయితే మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ మూడ్ లో ఉన్న ఆమె, జిమ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియో పంచుకున్నారు. ఈ క్రమంలో ప్రెగ్నెన్సీ సమయంలో కసరత్తులు సేఫేనా అనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి గర్భిణీలు పొట్టపై ఎలాంటి ఒత్తిడి పడకుండా వ్యాయామం చేయాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. పైగా ఈ వర్కౌట్స్ వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగకపోవడం, బీపీ, షుగర్లు అటాక్ కాకుండా ఉండటం జరుగుతుందని తెలుపుతున్నారు. నడుము నొప్పి నుంచి రిలీఫ్, నార్మల్ డెలివరీకి అధిక అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. అందుకే సమంత కూడా చిన్నపాటి కసరత్తలు చేసిందని అంటున్నారు.






