Samantha: సమంతకు మరో అరుదైన గుర్తింపు.. ప్రముఖ మ్యాగజైన్‌పై మెరిసిన బ్యూటీ

by Chukka Sudharani |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు మరో అరుదైన గుర్తింపు దక్కింది.

Samantha: సమంతకు మరో అరుదైన గుర్తింపు.. ప్రముఖ మ్యాగజైన్‌పై మెరిసిన బ్యూటీ
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు మరో అరుదైన గుర్తింపు దక్కింది. ఆమె గ్రేజియా ఇండియా అనే ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్‌పై మెరిసింది. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈ స్టిల్ విడుదల కాగా.. గ్రేజియా ఇండియా తన అఫీషియల్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఈ మేరకు ‘పదిహేను సంవత్సరాలు, లెక్కలేనన్ని పాత్రలు, ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం. సినిమాలలో యాక్ట్ చేయడం నుంచి.. నిర్మించడం వరకు సమంత రూత్ ప్రభు తన సొంత మార్గాన్ని ఎంతో చక్కగా డైరెక్ట్ చేసుకుంది. అలాగే యూరోసెంట్రిక్ ఆదర్శాలను దాటి ఫ్యాషన్ ఇమేజరీని పునర్నిర్మిస్తున్న ఐదుగురు మహిళా ఫోటోగ్రాఫర్లు, ఆరుగు డిజైనర్లతో ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటాము’ అంటూ ఫొటోలను షేర్ చేసింది గ్రేజియా ఇండియా. ఈ మ్యాగజైన్‌పై సమంత లుక్‌కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. లింక్


Next Story