- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samantha : గుడ్ న్యూస్ ప్రకటించిన సమంత.. ఏ రోజు, ఏ టైంలో అయినా రావొచ్చు అంటూ పోస్ట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం నిర్మాతగా మారిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల ట్రాలాల పిక్చర్స్ (Tralala Pictures) సంస్థ ప్రారంభించిన ఆమె ‘శుభం’ (Shubham) చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి నిత్యం ఏదో ఒక అప్డేట్స్ ప్రకటిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు చిత్ర బృందం. ఇటీవల ‘శుభం’ టీజర్(Teaser)ను విడుదల చేసి అందరినీ కడుపుబ్బా నవ్వించింది సమంత. అంతే కాకుండా ఈ సినిమాతో పలువురు కొత్త యాక్టర్స్ కూడా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.
ఇక సమంత నిర్మాణంలో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచానాలు ఉన్నాయి. ఇక ‘శుభం’ మూవీ సమ్మర్ స్పెషల్(Summer Special)గా మే 9న గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి రా . దీంతో రిలీజ్‌కు ఎంతో సమయం లేకపోవడంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సమంత ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ మేరకు తన X ఖాతా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. ‘శుభం’ ట్రైలర్ (Trailer) ఏ రోజు, ఏ టైమ్‌లో అయినా రావొచ్చు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఈ సినిమా ఖచ్చితంగా విజయం అందుకుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు సామ్ ఫ్యాన్స్.
#Subham pic.twitter.com/ZVdYN5mo1Q
— Samantha (@Samanthaprabhu2) April 24, 2025






