- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ డ్రెస్‌లో ఉండగా ఫొటోలు తీసిన ఫోటోగ్రాఫర్లు.. బుద్ధి లేదా అంటూ వారిపై సమంత ఫుల్ ఫైర్.. మండిపడుతున్న నెటిజన్లు
స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dhulipala)తో డిసెంబర్‌లో రెండో పెళ్లి చేసుకున్నాడు .
సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా ప్రజెంట్ సామ్ నిర్మాత(Producer)గా మారి సినిమాలు నిర్మిస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ‘శుభం’(Shubham) మూవీని నిర్మించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న 'రక్త్ బ్రహ్మాండ్'(Rakth Brahmand) వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా సమంతకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె జిమ్ నుండి బయలుదేరుతుండగా మీడియా ఆమెను వెంబడించారు.
దీనితో అసౌకర్యానికి గురైన సమంత వారిపై సీరియస్ అయ్యింది. జిమ్ నుంచి బయటికొచ్చిన సమంత, వైన్ కలర్ జిమ్ వేర్‌లో ఫోన్ మాట్లాడుతూ ఉండగా, ఫోటోగ్రాఫర్లు ఫొటోలు తీయడానికి ప్రయత్నించారు. ఆమె స్పష్టంగా "ఫొటోలు తీయవద్దు" అని కోరినా, వారు వినిపించకుండా కంటిన్యూ చేశారు. దీంతో సమంత తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, కారులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వారు అలానే బిహేవ్ చేయడంతో "ఆపండి" అని ఫుల్ ఫైర్ అయ్యి కారులోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఆ డ్రెస్సులో ఉన్నప్పుడు ఎవరైనా ఫొటోలు తీస్తారా అంటూ ఫొటోగ్రాఫర్ల పై మండి పడుతున్నారు.






