- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెక్కి వెక్కి ఏడ్చిన సల్మాన్.. షాకైన అభిమానులు
బాలీవుడ్ కండల వీరుడు కంటతడి పెట్టుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ కండల వీరుడు కంటతడి పెట్టుకున్నారు. చిన్న పిల్లోడి మాదిరిగా వెక్కి వెక్కి ఏడవడంతో ఆయన అభిమానులు అంతా షాక్ అయ్యారు. ఎప్పుడు నవ్వుతూ కనిపించే సల్మాన్ ఖాన్ తను హోస్ట్ చేస్తున్న హిందీ బిగ్ బాస్ షోలో ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటీవల మరణించిన బాలీవుడ్ లెజెండ్ నటుడు ధర్మేంద్ర మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం గతంలో ధర్మేంద్ర బిగ్ బాస్ షో కి వచ్చిన వీడియోను ప్లే చేసినపుడు సల్మాన్ బోరున ఏడ్చేశాడు. ఈ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ... " మనం హీ మ్యాన్ ను కోల్పోయాం. ఆయనకంటే గొప్ప నటుడు లేడు అనుకుంటున్న.
మిస్ యూ ధర్మేంద్ర.. నా పుట్టిన రోజు నాడే మీరు ఈ లోకాన్ని వదిలి వెళ్ళడం మరింత బాధ కలిగించింది.." అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కాగా కండల వీరున్ని బిగ్ షోలో సరదాగ నవ్వుతూ.. కొప్పడటమో చూసాం గాని.. ఇలా చిన్న పిల్లోడి మాదిరిగా కన్నీళ్లు పెట్టుకోవడం ఎన్నడూ చూడలేదంటూ సల్మాన్ అభిమానులు కూడా వర్రీ అవుతున్నారు.






