స‌లార్ అన్‌సీన్ పిక్.. నెట్టింట వైర‌ల్ అవుతున్న క్యూట్ ఫొటో

by Gugulothu.Kavitha |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’(Salar) సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.

స‌లార్ అన్‌సీన్ పిక్.. నెట్టింట వైర‌ల్ అవుతున్న క్యూట్ ఫొటో
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’(Salar) సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. యాక్షన్, ఎమోషన్, పవర్‌ఫుల్ కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాకు ఇప్పటికే పార్ట్ 2 కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో ‘సలార్ పార్ట్ 2’ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు విడుదలవుతుంది అనే అంశంపై డార్లింగ్ ఫ్యాన్స్‌లో రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది.

అయితే ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శృతి హాసన్(Sruthi Haasan) హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇక జనవరి 28న శృతి హాసన్ పుట్టిన రోజు సందర్భంగా ‘సలార్’ మూవీ సోషల్ మీడియా పేజీ నుంచి అభిమానులకు ఓ ప్రత్యేక ట్రీట్ అందింది. సలార్ షూటింగ్ సమయంలో తీసిన ప్రభాస్, శృతి హాసన్‌ల అన్‌సీన్ ఫొటోను మేకర్స్ షేర్ చేస్తూ.. “సలార్ 2లో తనకు ఏం జరగబోతుందో ఆద్య దేవాకు చూపిస్తోంది” అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జోడించారు.

ఈ ఫొటోలో శృతి హాసన్ తన మొబైల్ ఫోన్‌లో ప్రభాస్‌కు ఏదో చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని చూస్తూ ఇద్దరూ నవ్వుతూ చాలా క్యూట్‌గా ఉన్నారు. షూటింగ్ బ్రేక్స్ సమయంలో తీసిన ఈ క్యూట్ పిక్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story