- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్ రామాయణంపై సూపర్ అప్‌డేట్.. ఆనందంలో సాయి పల్లవి ఫ్యాన్స్
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ (Director Nitish Tiwari) దర్శకత్వంలో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’ (Ramayanam).

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ (Director Nitish Tiwari) దర్శకత్వంలో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’ (Ramayanam). ఇందులో రాముడిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తుంది. ఇప్పటికే వీరిద్దరి సంబంధించిన లుక్స్ కూడా నెట్టింట వైరల్ కాగా.. సూపర్ బజ్ క్రియేట్ అయింది. అంతే కాకుండా.. ఇందులో రావణుడిగా స్టార్ హీరో యష్ (Yash) నటిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మూవీని నమిత్ మల్హోత్రా (Namit Malhotra)తో కలిసి అల్లు అరవింద్ (Allu Aravind) అత్యంత భారీ బడ్జె్ట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాకు రెండు భాగాలుగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. అందులో పార్ట్1కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. తాజాగా సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేశారట మేకర్స్. ఇందులో నేచురల్ బ్యూటీ సాయిపల్లవిపై లంకలో సీన్స్ చిత్రీకరణ చేస్తున్నారని బాలీవుడ్ సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. దీని అనంతరం రణబీర్‌పై షూటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్‌గా మారండంతో బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా మారిపోయిన సాయిపల్లవిని చూసి నేచురల్ బ్యూటీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ సినిమా పార్ట్-1 2026 దీపావళి కానుకగా, పార్ట్-2 2027 దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అనౌన్స్ చేశారు.






