ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అతడే.. సాయి ధరమ్ తేజ్ షాకింగ్ కామెంట్స్

by velandi.Saikiran |

అల్లు అర్జున్ అంటే గిట్ట‌నట్లుగా వ్యవహరించారు. అయితే తాజాగా సాయి ధరమ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి

ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అతడే.. సాయి ధరమ్ తేజ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు, మెగా ఫ్యాన్స్‌ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశాడన్న ఒక్క కారణంతో అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారు మెగా అభిమానులు. ముఖ్యంగా ఆ ఎన్నికల నుంచి అల్లు అర్జున్ పై పరోక్షంగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అంటే గిట్ట‌నట్లుగా వ్యవహరించారు. అయితే తాజాగా సాయి ధరమ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఓ ఈవెంట్ లో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్... అల్లు అర్జున్ ను మెచ్చుకుంటూ మాట్లాడారు.

పాన్ ఇండియా స్టార్ హీరో అంటే అల్లు అర్జున్ అంటూ వ్యాఖ్యానించారు. అక్కడ ఉన్న అభిమానులు అందరూ అల్లు అర్జున్ గురించి మాట్లాడండి అంటే పెదవి విప్పారు సాయి ధరమ్ తేజ. ఆయన చాలా గొప్ప యాక్టర్ అంటూ కితాబ్ ఇచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అంటూ మెచ్చుకున్నారు. ఆయన చాలా గొప్పోళ్లు అయిపోయారని వ్యాఖ్యానించారు. దీంతో సాయి ధరంతేజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. మా హీరో ముందు ఎవరైనా తగ్గాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్లిక్




Next Story