- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్యపై అభిమానంతో వాయిదా
హెచ్‌ఎన్‌జి సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఉదయ్ శర్మ రచన,దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సఃకుటుంబానాం. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం

దిశ, సినిమా : హెచ్‌ఎన్‌జి సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఉదయ్ శర్మ రచన,దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సఃకుటుంబానాం. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్ కీలకపాత్రలో పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా మధు దాసరి డిఓపిగా పనిచేశారు. ఎడిటర్ గా శశాంక్ మలి చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు సోషల్ మీడియా ద్వారా మంచి ప్రశంసలు వచ్చాయి. అయితే డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు మేకర్స్. బాలకృష్ణ - బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ‘అఖండ 2’ ఇదే రోజున విడుదల కానుండటంతో.. మా సినిమా వల్ల ఎటువంటి చిన్నపాటి అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో మా సఃకుటుంబానాం చిత్రాన్ని డిసెంబర్ 19వ తేదీన విడుదల చేయడం జరుగుతుందని ప్రకటించారు. అఖండ తాండవం చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కొన్ని నిర్ణయాలు వ్యాపారం కోసం కాదు, ఎమోషన్స్ కోసం. అదేవిధంగా ఈ నిర్ణయం కూడా "జై బాలయ్య" అనే తెలుగువారి నినాదం కోసం అని చెప్పారు మేకర్స్.






