‘టాక్సిక్’ అప్డేట్ ఇచ్చిన రుక్మిణీ వసంత్

by Sujitha Rachapalli |

బ్యూటిపుల్ అండ్ టాలెంటెడ్ రుక్మిణీ వసంత్ స్టార్ రేంజ్ అందుకుంది. మొదటి సినిమాతోనే టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయిన బ్యూటీ.. ఇప్పుడు స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’లో హీరోయిన్‌గా చేస్తున్నట్లు

‘టాక్సిక్’ అప్డేట్ ఇచ్చిన రుక్మిణీ వసంత్
X

దిశ, సినిమా : బ్యూటిపుల్ అండ్ టాలెంటెడ్ రుక్మిణీ వసంత్ స్టార్ రేంజ్ అందుకుంది. మొదటి సినిమాతోనే టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయిన బ్యూటీ.. ఇప్పుడు స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’లో హీరోయిన్‌గా చేస్తున్నట్లు కన్ఫర్మ్ కాగా రాక్ స్టార్ యశ్ ‘టాక్సిక్’లోనూ కీలకపాత్రలో కనిపించబోతుంది. ఇందుకు సంబంధించిన విషయాలను ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసింది. హీరో యశ్, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ విధానం, స్క్రిప్ట్స్, షూటింగ్ స్టైల్ చాలా భిన్నంగా, అద్భుతంగా ఉన్నాయని చెప్పింది. పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రాబోతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా కురేషీ, అక్షయ్ ఓబెరాయ్ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది మార్చి 16న విడుదల కాబోతున్న మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రఫీ రాజీవ్ రవి, VFX: DNEG అందిస్తున్నారు. ః

Next Story