Rukmini Vasant: బంపర్ ఆఫర్ అందుకున్న రుక్మిణి వసంత్.. ఆ స్టార్ డైరెక్టర్‌తో సినిమా

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్‌లో థగ్‌లైఫ్ (Thuglife) మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

Rukmini Vasant: బంపర్ ఆఫర్ అందుకున్న రుక్మిణి వసంత్.. ఆ స్టార్ డైరెక్టర్‌తో సినిమా
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్‌లో థగ్‌లైఫ్ (Thuglife) మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో శింబు(Simbu)తో పాటు కమల్ హాసన్ (Kamal Haasan) కూడా ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. త్రిష (Trisha) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య జూన్ 5న థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. థగ్‌లైఫ్ సినిమాను ప్రేక్షకుల్లోకి మరింతగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ మూవీ అనంతరం శింబు సింగిల్‌గా మణిరత్నం డైరెక్షన్‌లో మరో మూవీ లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ కాగా.. తాజాగా ఇందులో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. శింబు, మణిరత్నం (Mani Ratnam) కాంబినేషన్‌లో వస్తున్న ఈ రొమాంటిక్ లవ్ డ్రామలో యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్‌(Rukmini Vasant)ను దాదాపు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్. ఇక ప్రజెంట్ ఇందుకు సంబంధించి పోస్ట్ వైరల్ కావడంతో.. కెరీర్ స్టార్టింగ్‌లో స్టార్ డైరెక్టర్ అండ్ స్టార్ హీరో సినిమాలో చాన్స్ అంటే రుక్మిణి లైఫ్ టర్న అయినట్లే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

Next Story