- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RT76: నాన్-థియేట్రికల్ బిజినెస్ క్లోజ్
మాస్ మహారాజా రవితేజ ప్రజెంట్ ‘మాస్ జాతర’ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ ప్రజెంట్ ‘మాస్ జాతర’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ రిలీజ్‌కు సిద్ధం అవుతుండగా.. వరుస అప్డేట్స్ ఇస్తున్నారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే.. ఈ మూవీ తర్వాత రవితేజ డైరెక్టర్ కిషోర్ తిరుమలతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. రవితేజ కెరీర్‌లో 76వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ రాగా.. షూటింగ్‌లో కూడా వేగం పెంచారు చిత్ర బృందం.
RT76 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీ నుంచి తాజాగా ఓటీటీ అప్డేట్ బయటకు వచ్చింది. అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ అప్పుడే నాన్-థియేట్రికల్ బిజినెస్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. RT76 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ధరకు సొంతం చేసుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు చానల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ మూవీని సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.






