- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాక్సాఫీస్ భారీ హిట్ సినిమాకు అక్కడ రూ.90 కోట్ల నష్టం
ధురంధర్.. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ ను ప్రపంచంలో ఓ స్థాయిలో నిలబెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: ధురంధర్.. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ ను ప్రపంచంలో ఓ స్థాయిలో నిలబెట్టింది. సాధారణ అంచనాలతో వచ్చి.. ప్రపంచ వ్యాప్తంగా రూ.1100 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. రన్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా భారత్ తో పాటు.. యూరప్, నార్త్ అమెరికా దేశాల్లో రిలీజైంది. కానీ పశ్చిమ ఆసియాలో మాత్రం నిషేధం విధించారు. గల్ఫ్ మార్కెట్లో ధురంధర్ విడుదల కాకపోవడంతో దాదాపు రూ.90 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా ఫారెన్ డిస్ట్రిబ్యూటర్ ప్రణబ్ కపాడియా తెలిపారు.
గల్ఫ్ దేశాల్లో ఇలాంటి యాక్షన్ సినిమాకు ప్రేక్షకాదరణ ఉంటుందని, విడుదల చేసేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని తెలిపారు. అందరి మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత తమపై ఉండటంతో.. ఈ విషయంలో ఏమీ మాట్లాడలేకపోయామన్నారు. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా తెరకెక్కించడం వల్లనే బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాతో పాటు యూఏఈలో కూడా ఈ సినిమా విడుదల కాలేదని బాలీవుడ్ మీడియా పేర్కొంది. గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా రిలీజ్ అయి ఉంటే.. సినిమా కలెక్షన్లు రూ.1200 కోట్లు వసూలయ్యేవి.






