- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లడ్ షేడ్‌తో మరిగిపోతున్న రౌడీ జనార్థన
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో నటిస్తున్న క్రేజీ మూవీ ‘రౌడీ జనార్థన’. స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ

దిశ, సినిమా : స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో నటిస్తున్న క్రేజీ మూవీ ‘రౌడీ జనార్థన’. స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత దిల్ రాజు.. ‘రౌడీ జనార్థన టైటిల్ గ్లింప్స్ మీకు చూపించేందుకు రవి కిరణ్ కొద్ది రోజులుగా తన టీమ్‌తో వర్క్ చేస్తూ వచ్చాడు. మూడు రోజుల క్రితం ఈ సినిమాను ఎలా చూపించబోతున్నాం అనేది చిన్న స్టోరీ రివీల్ చేశాడు. విజయ్ దేవరకొండ డిఫరెంట్ మూవీస్ చేస్తూ వచ్చాడు. కానీ తొలిసారిగా ఈ మూవీలో ఆంధ్రలోని ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడిస్తున్నాం. విజయ్ ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడటం ఈ స్టోరీ విన్నప్పుడు నాకు యూనిక్‌గా అనిపించింది. ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి యూత్ ఫుల్ మూవీస్ చేసిన హీరో.. ఇప్పటి వరకు ఇంత మాస్, బ్లడ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్‌లో విజయ్ కనిపించబోతున్నాడు. 80 దశకం బ్యాక్ డ్రాప్‌లోని వరల్డ్‌ను ఈ సూపర్బ్ టెక్నీషియన్స్ అంతా క్రియేట్ చేశారు. రవి కిరణ్ విజన్‌లోని కొత్తదనాన్ని తీసుకొచ్చేందుకు ఈ టీమ్ అంతా కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని మేము ఎంకరేజ్ చేస్తుంటే ఇలాంటి మంచి గ్లింప్స్ మీ ముందుకు వచ్చింది. సినిమా కూడా అలా వచ్చేవరకు రవి కష్టపడి చేయించుకుంటాడని నమ్మకం ఉంది. ‘రాజా వారు రాణి గారు’ అనే చిన్న సినిమా చేసి ఇండస్ట్రీని, ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకోగలిగాడు. రెండో సినిమాకు మంచి స్క్రిప్ట్ అందించాడు. ఇప్పుడు మూడో సినిమాకు ‘రౌడీ జనార్థన’తో పెద్ద బాధ్యత పెట్టుకున్నాడు. మీ అందరినీ అలరించేందుకు నెక్ట్స్ ఇయర్ రిలీజ్‌కు మూవీని తీసుకొస్తాం’ అని తెలిపాడు.
డైరెక్టర్ రవికిరణ్ కోలా మాట్లాడుతూ - మీ అందరి లాగే నేను కూడా విజయ్ దేవరకొండ అభిమానిని. నేను అభిమానించే కీర్తి సురేష్, రాజు గారు వంటి వారితో కలిసి ఈ సినిమా చేస్తున్నాను. రౌడీ జనార్థన టైటిల్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. రౌడీ జనార్థన ఎలా ఉంటాడో పరిచయం చేసి ఆ తర్వాత టైటిల్ రివీల్ చేయాలని అనుకున్నాం. కానీ టైటిల్ మీకు తెలిసిపోయింది. సినిమా అనుకున్నది అనుకున్నట్లుగా వస్తోంది. అందుకు మా టీమ్ మెంబర్స్ చాలా కష్టపడుతున్నారు. ఇకపై మా మూవీ నుంచి రిలీజ్ చేసే కంటెంట్ కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ కథ చెప్పిన కొద్దిసేపటికే విజయ్ ఆ క్యారెక్టర్ లా మాట్లాడటం, చెప్పే సీన్ కు రౌడీ జనార్థనలా రియాక్ట్ అవడం మొదలుపెట్టాడు. ఇన్ స్టంట్ గా క్యారెక్టర్ ను ఓన్ చేసుకున్నాడు. నాకు ఎంకరేజింగ్ గా అనిపించి మిగతా స్క్రిప్ట్ ను ఉత్సాహంగా చెప్పేశాను. ఆ తర్వాత మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. అలా ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. వర్క్ షాప్స్ అన్నీ చేసి ఫస్ట్ డే షూట్ కోసం సెట్ రెడీ చేస్తున్నాం. 8 నిమిషాల లాంగ్ సీన్ చేయాలి. ఆ ముందు రోజే విజయ్ సెట్ లోకి వచ్చి ఆ డైలాగ్స్ మొత్తం చెప్పేస్తున్నాడు. అప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా అనిపించింది. ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ గారు చాలా ఆక్యురేట్ గా డైలాగ్స్ చెబుతున్నారు. నేను ఆ ఏరియాలో పుట్టి పెరిగిన వాడిని కాబట్టి సరిగ్గా మాట్లాడుతున్నారా లేదా అనేది తెలిసిపోతుంది. విజయ్ ఆ యాసలో మాట్లాడటం మేమంతా ఎంజాయ్ చేస్తున్నాం. కథ ఎంత బాగుందో, ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ మాట్లాడటం అనేది కూడా అంతే బాగుందని రాజు గారు అనేవారు. అలాగే ఈ యాసలో డైలాగ్స్ ఫ్లేవర్ అలాగే రావాలని విజయ్, రాజు గారు పర్టిక్యులర్ గా ఉండేవారు. అన్నారు.






