Roshan Kanakala: ఈసారి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు.. యంగ్ హీరో పోస్టర్‌పై నెటిజన్స్ రియాక్షన్!

by Chukka Sudharani |

యంగ్ హీరో రోషన్ కనకాల (Roshan Kanakala) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోగ్లీ 2025’ (Mowgli 2025).

Roshan Kanakala: ఈసారి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు.. యంగ్ హీరో పోస్టర్‌పై నెటిజన్స్ రియాక్షన్!
X

దిశ, సినిమా: యంగ్ హీరో రోషన్ కనకాల (Roshan Kanakala) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోగ్లీ 2025’ (Mowgli 2025). ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ (Sandeep Raj) దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ మూవీ నుంచి తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ రోజు రోషన్ కనకాల పుట్టినరోజు కావడంతో.. అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ అద్భుతమైన కొత్త పోస్టర్‌(Poster)ను రిలీజ్ చేశారు నిర్మాతలు. ఇంటెన్స్ లుక్ (Intense look), మెడ గొలుసులా వేలాడుతున్న గద, చేతి చుట్టూ చుట్టబడిన వస్త్రం, అతని పాత్ర యొక్క వ్యక్తిత్వాన్ని ఎలివేట్ చేస్తుంది. రిలీజ్ చేసిన పోస్టర్‌లో రోషన్ లుక్ చూస్తే.. ‘మోగ్లీ 2025’ లో అతని పాత్ర యొక్క యాక్షన్-ప్యాక్డ్ స్వభావాన్ని సూచిస్తోంది. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారడంతో.. రోషన్ ఈసారి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా.. ఈ చిత్రంతో సాక్షి సాగర్ మడోల్కర్ (Sakshi Sagar Madolkar) హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఫుల్ యాక్షన్ జోన్‌లో తెరకెక్కుతోన్న మోగ్లీ 2025 ఈ సంవత్సరం చివర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Next Story