- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైరాన్ పల్లి కథ.. ‘ఛాంపియన్’పై హీరో రోషన్
‘ఛాంపియన్’లో యాక్షన్ డ్రామా వార్ అద్భుతంగా ఉంటుదన్నాడు యంగ్ హీరో రోషన్. ఇందులోని హ్యూమన్ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుందని తెలిపాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ మూవీ 1948లో జరిగిన బైరాన్ పల్లి చరిత్ర గురించి ఉంటుందని.. ఇందులో

దిశ, సినిమా : ‘ఛాంపియన్’లో యాక్షన్ డ్రామా వార్ అద్భుతంగా ఉంటుదన్నాడు యంగ్ హీరో రోషన్. ఇందులోని హ్యూమన్ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుందని తెలిపాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ మూవీ 1948లో జరిగిన బైరాన్ పల్లి చరిత్ర గురించి ఉంటుందని.. ఇందులో మైఖేల్ అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్‌ను క్రియేట్ చేసి ప్రజెంట్ చేశామని తెలిపాడు. ఈ క్యారెక్టర్ కోసం హైదరాబాదీ యాస నేర్చుకున్నానని.. డైరెక్టర్ హెల్ప్‌తోపాటు వర్క్ షాప్స్ కూడా చేశామని తెలిపాడు.
‘పీటర్ అద్భుతమైన యాక్షన్ డిజైన్ చేశారు. షూటింగ్లో నాకు కొన్ని గాయాలు కూడా అయ్యాయి. కానీ యాక్షన్ సినిమా అంటే ఇలాంటివి మామూలే. ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా హైదరాబాద్ కి స్వతంత్రం రాని రోజుల్లో జరిగిన కథ ఇది. మా డైరెక్టర్ గారు అన్ని రిఫరెన్సులు ఇచ్చారు. స్వప్న గారు చాలా పర్టికులర్‌గా ఉంటారు. డైరెక్టర్ గారు, స్వప్న గారు, ఆర్ డైరెక్టర్ తోట గారు ప్రతిదీ రీసెర్చ్ చేశారు. ఆ కాలంలో ఎలా ఉండేవారు డైరెక్టర్ గారు ప్రతీది కేర్ తీసుకుని చేశారు. ఇందులో అద్భుతమైన డ్రామా ఉంది. ప్రతి దానికి ఒక కనెక్షన్ ఉంటుంది. బైరాన్ పల్లి గ్రామంలో ప్రతి క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి పాత్రకు ఒక ప్రారంభం, ముగింపు ఉంటుంది. ఇందులో హీరో హీరోయిన్ మధ్య డ్రామా అనే కాన్సెప్ట్‌తో చాలా మంచి ఫన్ ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్‌లో చాలా డెప్త్ ఉంటుంది. హీరో పర్పస్‌ని ఫుల్ ఫిల్ చేస్తుంది. ఇక కళ్యాణ్ చక్రవర్తి గారి పాత్ర ఒక నిజమైన పాత్ర స్ఫూర్తితో డైరెక్టర్ రాసుకున్న క్యారెక్టర్ అది. ఆయనతో కలిసి నటించడం చాలా గొప్ప అనుభూతి. ఆయన డాక్టర్ కూడా. చాలా విషయాలు పంచుకునేవారు. నిజంగా ఇది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్’ అని చెప్పుకొచ్చాడు.






