- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘RK దీక్ష’.. న్యూ పోస్టర్
ఆర్ కె ఫిల్మ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాణ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘RK దీక్ష’. బిఎస్ రెడ్డి సమర్పిస్తున్న మూవీలో ఢీ జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్‌గా, కిరణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాజ్ కిరణ్ సంగీతం అందించగా మేఘన శ్రీను ఎడిటర్‌గా పనిచేశారు. డిసెంబర్ 25న మూవీ విడుదల కాబోతుండగా..

దిశ, సినిమా : ఆర్ కె ఫిల్మ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాణ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘RK దీక్ష’. బిఎస్ రెడ్డి సమర్పిస్తున్న మూవీలో ఢీ జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్‌గా, కిరణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాజ్ కిరణ్ సంగీతం అందించగా మేఘన శ్రీను ఎడిటర్‌గా పనిచేశారు. డిసెంబర్ 25న మూవీ విడుదల కాబోతుండగా.. ఈ చిత్ర నూతన పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర నిర్మాత మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శక నిర్మాత పితాని రామకృష్ణ గౌడ్... ‘మా చిత్ర ప్రెస్ మీట్‌కు ఆహ్వానించిన వెంటనే వచ్చి మాకు సపోర్ట్ చేసిన ప్రసన్న కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్న ఎన్టీఆర్ గారు 50 సంవత్సరాల క్రితం చేసిన దీక్ష అనే టైటిల్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడం గర్వంగా అనిపిస్తుంది. ఇప్పటికే అనేక సినిమాలు తీశాను. కాని కొన్ని సంవత్సరాల నుంచి లీజు పద్ధతిలో సినిమాలు థియేటర్లలో నడపడం వల్ల చిన్న సినిమాలు, నిర్మాతలు చాలా ఇబ్బంది పడ్డారు. దీనిని కచ్చితంగా అరికట్టే మార్గంలో ప్రసన్న కుమార్, తదితరులు ప్రయతిస్తున్నారు. ఇక ఈ సినిమాలో జవాన్లపై ఒక పాట ప్రత్యేకంగా ఉండబోతుంది. సినిమాలో ఎన్నో అద్భుతమైన అంశాలు ఉంటాయి. నటీనటులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. దీక్ష సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.






