తిరుమలలో టాలీవుడ్ జంట రీల్స్.. కేసు పెట్టాలంటూ కామెంట్స్ !

by velandi.Saikiran |   (  Updated:2025-06-18 12:47:37  IST  )

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు ఉన్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో సోషల్ మీడియాను విపరీతంగా

తిరుమలలో టాలీవుడ్ జంట రీల్స్.. కేసు పెట్టాలంటూ కామెంట్స్ !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు ఉన్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో సోషల్ మీడియాను విపరీతంగా వాడుకొని పాపులర్.... ఇండస్ట్రీలో రాణించేవారు ఎక్కువ అవుతున్నారు. అలాంటి వారిలో రీతు చౌదరి ఒకరు. సోషల్ మీడియా స్టార్ గా పేరుగాంచిన రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తూ.. యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

అటు జబర్దస్త్ కామెడీ షో, కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా మెరిసింది ఈ అందాల తార రీతూ చౌదరి. ఇది ఇలా ఉండగా తాజాగా రీతూ చౌదరి తిరుమల శ్రీవారి సన్నిధిలో మెరిసింది. ఎప్పుడు పొట్టి బట్టలు వేసే రీతూ చౌదరి... తిరుమలలో మాత్రం... సాంప్రదాయ బద్ధంగా లంగా ఓణి ధరించింది. అటు బిగ్ బాస్ స్టార్ అఖిల్ కూడా ఆమెతో కనిపించాడు. ఇద్దరు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

అయితే దీనికి సంబంధించిన రీల్.. ను నటి రీతూ చౌదరి తన సోషల్ మీడియాలో పంచుకుంది. దీనిపై సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. సాంప్రదాయంగా బట్టలు వేసింది కానీ... తన ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా.. లంగా ఓణి సెట్ చేసుకుందని కొంతమంది ఫైర్ అవుతున్నారు. తిరుమల సన్నిధిలో అలా... కొంగు కిందికి వేసుకోకూడదని... అలా చేస్తే కేసులు పెట్టాల్సిందేనని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరికొంతమంది ఈ ఇద్దరి జంట బాగుందని లవ్ సింబల్స్ పెడుతున్నారు.

Next Story