Rhea Chakraborty: ఆయన కారణంగా మా జీవితాలే నాశనం అయ్యాయి.. హీరో మరణంపై రియా చక్రవర్తి కామెంట్స్

by Chukka Sudharani |

నటి రియా చక్రవర్తి ‘తునీగా తునీగా’ సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది.

Rhea Chakraborty: ఆయన కారణంగా మా జీవితాలే నాశనం అయ్యాయి.. హీరో మరణంపై రియా చక్రవర్తి కామెంట్స్
X

దిశ, సినిమా: నటి రియా చక్రవర్తి ‘తునీగా తునీగా’ సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది. ఇక బాలీవుడ్‌లో కూడా పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. అప్పట్లో హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో ప్రేమాయణం నడిపింది. అయితే.. అతి పిన్న వయసులోనే సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకుని మరణించడం ఇండస్ట్రీలో తీవ్ర విషాదంగా మారింది. ఇక సుశాంత్ మరణానికి తన గర్ల్ ఫ్రెండ్ రియానే కారణమంటూ ఆమెపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అంతే కాకుండా ఈ కేసులో రియాను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపారు. తర్వాత ఈమెతో పాటు ఈ కేసులో రియా తమ్ముడైన షోయిక్ చక్రవర్తిపై కూడా కేసు నమోదు అయింది. దీంతో వీరిద్దరి కెరీర్‌లు నాశనమయ్యాయి అంటూ రియా ఎన్నో ఇంటర్వ్యూస్‌లో తెలిపింది. రీసెంట్‌గా ఈ ఇష్యూపై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ నటి.

‘సుశాంత్ సింగ్ మరణం తర్వాత మా జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. మేము చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాము.. ఇక ఆ ఒక్క సంఘటనతో మా జీవితం మొత్తం ముగిసిపోయింది అనిపించింది. నాకు నటనాపరంగా ఎలాంటి ఆఫర్లు రాలేదు. అలాగే నా తమ్ముడు షోయిక్ క్యాట్ పరీక్షలో 96% తో పాస్ అయ్యాడు. కానీ అదే సమయంలో నాతోపాటు నా తమ్ముడు కూడా అరెస్ట్ అయ్యాడు. జైలు నుంచి నా తమ్ముడు తిరిగి వచ్చాక మొదటి త్రైమాసిక పరీక్షలు కూడా మిస్ అయ్యాడు. దీంతో అతడి ఎంబీఏ కెరియర్ భవిష్యత్తును కూడా కోల్పోవాల్సి వచ్చింది. అలాగే.. ఏ కార్పొరేట్ సంస్థ కూడా మా తమ్ముడుని తీసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో తమ్ముడికి ఉద్యోగం లభించడం కూడా కష్టంగా మారింది. దాంతో కొద్ది రోజులు మా జీవితాలు ఎటువైపు వెళుతున్నాయో అర్ధం కాలేదు. ఇక మాకు ఎవరూ అవకాశం ఇవ్వకపోయేసరికి మేమే బిజినెస్ మొదలు పెడదామనుకున్నాం’ అని చెప్పుకొచ్చింది రియా చక్రవర్తి.

Next Story