- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. షాకింగ్ ట్వీట్ చేసిన ఆర్జీవీ.. ఇక్కడ కూడానా అంటున్న నెటిజన్లు..
అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో 260 మందికిపైగా చనిపోయారు. కేవలం ఒక్కరే మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. మరణించిన వారికి సంబంధించిన ఒక్కొక్కరి కథలు

దిశ, ఫీచర్స్ : అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో 260 మందికిపైగా చనిపోయారు. కేవలం ఒక్కరే మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. మరణించిన వారికి సంబంధించిన ఒక్కొక్కరి కథలు వింటుంటే కన్నీరు వస్తుండగా... ఇప్పటికే ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో దర్శకుడు ఆర్జీవీ ఇందుకు సంబంధించి ట్వీట్ చేశాడు. ‘దేవుడికే తెలియాలి దేవుడు ఏం చేస్తున్నాడో’ అంటూ పోస్ట్ పెట్టాడు. అసలు జీవితం ఎక్కడ ముగుస్తుందో చెప్పలేకపోతున్నామని బాధపడ్డాడు.
‘వెకేషన్ కోసం బ్యూటిఫుల్ ప్లేస్‌కు వెళ్తే తీవ్రవాదులు చంపేస్తరు.. ట్రోఫీ గెలిచామని సెలబ్రేట్ చేసుకునేందుకు వెళ్తే తొక్కిసలాటలో చనిపోతం.. ఎన్నో ఆశలతో ఫ్లైట్ ఎక్కితే క్రాష్ అయిపోయి జీవితం ముగుస్తుంది.. హాస్టల్‌లో అన్నం తింటుంటే నీపై ప్లేన్ కుప్పకూలి ప్రాణం పోతుంది’ అంటూ ఈ మధ్య దేశంలో జరిగిన దుర్ఘటనల గురించి ప్రస్తావిస్తూ ఎమోషనల్ అయిపోయాడు. కాగా ఆర్జీవీ కూడా దేవుడి గురించి మాట్లాడుతున్నాడంటే ఈ విమాన ప్రమాదం ఎంత బాధ పెట్టిందో అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుంటే.. నిజంగానే లైఫ్ అన్‌ప్రెడిక్టబుల్ అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. నువ్వు కూడా కాపీ కంటెంట్ పోస్ట్ చేస్తున్నావా అని ఇంకొందరు ఆర్జీవీని విమర్శించే పనిలో ఉన్నారు.






