Renu Desai: రెండో పెళ్లి గురించి రేణు దేశాయ్ పోస్ట్.. నెట్టింట వైరల్ అవుతోన్న న్యూస్!

by Kodari Anjali |

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ పిల్లల బాధ్యతల్ని చూసుకుంటుంది.

Renu Desai: రెండో పెళ్లి గురించి రేణు దేశాయ్ పోస్ట్.. నెట్టింట వైరల్ అవుతోన్న న్యూస్!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ పిల్లల బాధ్యతల్ని చూసుకుంటుంది. అలాగే పిల్లల కోరిక మేరకు మాజీ భర్త వద్దకు పంపిస్తూ.. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది. ఇక రేణు దేశాయ్ అండ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించే క్రమంలో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి ప్రేమకు చిహ్నంగ అకీరా నందన్(Akira Nandan), ఆద్యలు జన్మించారు.

ప్రస్తుతం పిల్లల బాగోగులు, వీరి చదువులు రేణు దేశాయ్ చూసుకుంటుంది. ఇక త్వరలో అకీరా నందర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త ఎంతవరకు వాస్తవమూ తెలియదు కానీ పవర్‌స్టార్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈగర్లీ వెయిటింగ్ జూనియర్ పవర్ స్టార్ అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియా వేదిక అయిన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రెండో పెళ్లి గురించి రాసుకొచ్చింది.

‘ముఖ్యమైన అంశాల (మతం, సంబంధాలు, సోషల్ మీడియా ప్రభావం మొదలైనవి) కంటే మీడియా వ్యక్తులు నా రెండవ వివాహ అంశంపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని నేను గ్రహించాను. ప్రేక్షకులుగా మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామో అది చూపిస్తుంది. రుజువు చేస్తుంది. కాబట్టి సుంకం ఆంక్షలు, మహిళల భద్రత, ఆర్థిక వృద్ధి, వాతావరణ మార్పులు మొదలైన అంశాలపై దృష్టి కేంద్రీకరించడానికి దయచేసి 44 ఏళ్ల వృద్ధురాలి పునర్వివాహం నుంచి మీ దృష్టిని మరల్చాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.

నేను నా వివాహం గురించి వందసార్లు మాట్లాడగలను. ఎందుకంటే ఇది ఖచ్చితంగా నా జీవితాన్ని, నా సన్నిహిత కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. దయచేసి మీ విద్య, జర్నలిజం అనుభవాన్ని కొంతమంది పెద్దల రెండవ వివాహం కోసం ఉపయోగించవద్దు. ఎందుకంటే ఇది సమాజం లేదా శాంతిభద్రతలను ప్రభావితం చేయదు’’. అంటూ రేణు దేశాయ్ రాసుకొచ్చింది.

Next Story