Renu Desai: దయచేసి సాయం చేయండి.. మీకు దండం పెడతాను అంటూ పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఎమోషనల్ పోస్ట్

by Gugulothu.Kavitha |

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Renu Desai: దయచేసి సాయం చేయండి.. మీకు దండం పెడతాను అంటూ పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జానీ’(Johney), ‘బద్రి’(Badri) వంటి సినిమాల్లో పవన్‌ కళ్యాణ్(Pawan Kalyan) సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత పవన్‌ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల (ఆద్య, అకిరా నందన్) బాధ్యతలను చూసుకుంటుంది. అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ‘టైగర్ నాగేశ్వరావు’(Tiger Nageswara Rao) మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ.. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది.

తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళాలు అడుగుతూ గుడ్ హార్ట్ బీయింగ్ అనిపించుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా రేణు దేశాయ్ తన ఇన్‌స్టా(Instagram)లో ఓ స్టోరీ పెట్టింది. అందులో .. ‘విజయవాడలో ఉంటున్న నా మంచి ప్రజలారా ప్రతి ఒక్కరూ దయచేసి నన్ను నమ్మి సహాయం చేయండి అండ్ రవి గారికి విరాళం ఇవ్వండి.. మీరు నా NGOకి విరాళం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ దయచేసి జంతు సంఘానికి ఖచ్చితంగా విరాళం ఇవ్వండి' అని రాసుకొస్తూ దండం పెడుతున్న ఎమోజీ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.


Next Story