Saiyami Kher : రికార్డు సృష్టించిన నటి సయామీ ఖేర్

by Muthe.Rajitha |

బాలీవుడ్ నటి సయామీ ఖేర్(Saiyami Kher) ఓ అరుదైన రికార్డు సృష్టించారు.

Saiyami Kher : రికార్డు సృష్టించిన నటి సయామీ ఖేర్
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ నటి సయామీ ఖేర్(Saiyami Kher) ఓ అరుదైన రికార్డు సృష్టించారు. గడిచిన ఏడాదిలో రెండు సార్లు ఐరన్‌మ్యాన్ 70.3 ట్రయథ్లాన్‌(Ironman 70.3 Triathlon)ను విజయవంతంగా పూర్తి చేసి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటిగా చరిత్ర సృష్టించారు. సయామీ తన మొదటి ఐరన్‌మ్యాన్ 70.3ను జర్మనీలోని బెర్లిన్‌లో సెప్టెంబర్ 2024లో పూర్తి చేశారు. ఈ రేసుతో ఆమె ఈ ట్రయథ్లాన్‌ను పూర్తి చేసిన తొలి భారతీయ మహిళా నటి(Indian Actress)గా నిలిచారు. ఆమె ఈ రేసును 8 గంటల్లోనే పూర్తి చేయడం గమనార్హం.

ఇక రెండవ రేసును స్వీడన్‌లోని జోంకోపింగ్‌లో జరిగిన ఐరన్‌మ్యాన్ 70.3 యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో సయామీ జులై 6న పూర్తి చేశారు. ఈ రేసు మొదటి రేసు కంటే ఎక్కువ సవాళ్లతో కూడుకున్నది. గడ్డకట్టించే నీటిలో ఈదటం, కఠినమైన కొండలపై సైక్లింగ్, బలమైన గాలులతో రేసు కష్టతరం అయినప్పటికీ, సయామీ ఈ రేసును మొదటి రేసు కంటే 32 నిమిషాలు ముందే పూర్తి చేశారు.

ఐరన్‌మ్యాన్ 70.3 ట్రయథ్లాన్ అంటే ఏమిటి?

ఐరన్‌మ్యాన్ 70.3 అనేది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఎండ్యూరెన్స్ రేసుల్లో ఒకటి. దీనిని హాఫ్ ఐరన్‌మ్యాన్ అని కూడా పిలుస్తారు. ఇందులో1.9 కి.మీ ఈత (ఓపెన్ వాటర్ స్విమ్మింగ్), 90 కి.మీ సైక్లింగ్, 21.1 కి.మీ హాఫ్ మారథాన్ రన్ ఉంటాయి. ఈ మూడు ఈవెంట్‌లను ఒకే రోజు విరామం లేకుండా వరుసగా పూర్తి చేయాలి.

Next Story