ఆ తేదీన ‘గౌతమ్ నంద’ రీ-రిలీజ్

by Pulgam srinivas |

గోపీచంద్ హీరోగా రూపొందిన గౌతమ్ నంద చిత్రాన్ని జూన్ 19వ తేదీన రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఆ తేదీన ‘గౌతమ్ నంద’ రీ-రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: గోపీచంద్ హీరోగా హన్సిక, క్యాథరిన్ హీరోయిన్లుగా రూపొందిన గౌతమ్ నంద చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై భగవాన్, పుల్లారావు నిర్మించారు. 2017లో విడుదలైన ఈ సినిమా ఆ సమయంలో బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. కానీ ఆ తర్వాత ఈ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన అనేక చిత్రాలు రీ-రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.

అందులో కొన్ని సినిమాలు మొదటి రిలీజ్‌లో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయినా కూడా రీ-రిలీజ్‌లో మంచి రెస్పాన్స్‌ను రాబడుతున్నాయి. ఇకపోతే గౌతమ్ నంద చిత్రాన్ని మరికొన్ని రోజుల్లోనే రీ-రిలీజ్ చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని జూన్ 19న పెద్ద ఎత్తున రీ-రిలీజ్ చేయనున్నట్లు వారు ప్రకటించారు. మొదటి విడుదలలో ప్రేక్షకాదరణ పొందడంలో విఫలమైన ఈ చిత్రం, రీ-రిలీజ్‌లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి.

Next Story