Ravi Teja: ఆ డైరెక్టర్‌తో నెక్ట్స్ సినిమా లైల్‌లో పెట్టిన రవితేజ.. త్వరలో అనౌన్స్‌మెంట్

by Chukka Sudharani |

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం RT-76తో బిజీగా ఉన్నాడు.

Ravi Teja: ఆ డైరెక్టర్‌తో నెక్ట్స్ సినిమా లైల్‌లో పెట్టిన రవితేజ.. త్వరలో అనౌన్స్‌మెంట్
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం RT-76తో బిజీగా ఉన్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమాతో బిజీగా ఉండగానే మరో మూవీ లైన్‌లో పెట్టాడు రవితేజ. ఈ మేరకు డైరెక్టర్ శివ నిర్వాణ రీసెంట్‌గా రవితేజను కలిసి స్టోరీ చెప్పారట.

కథ నచ్చడంతో వెంటనే ఆయన కూడా ఓకే చేశారట. అలాగే ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో రాబోతున్న మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. కాగా.. డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ‘నిన్ను కోరి’, ‘మజిలీ’, ‘ఖుషి’ వంటి లవ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో.. నువ్వైనా మా అన్నతో (రవితేజ) మంచి హిట్ లవ్ స్టోరీ తీయ్యి అంటూ కామెంట్స్ చేస్తున్నారు మాస్ మహారాజా ఫ్యాన్స్.

Next Story