బెడ్ రూమ్‌లో భార్యతో అలాగే ఉంటా.. సంచలనంగా మారిన నటుడి కామెంట్స్..

by Sujitha Rachapalli |

నటుడు రవి కిషన్ తన భార్య ప్రీతి శుక్లాపై ప్రశంసల వర్షం కురిపించాడు. తను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిందని.. తనకు అతిపెద్ద సపోర్టర్ తనేనని తెలిపాడు. అందుకే నిద్రపోతున్నప్పుడు భార్య పాదాలను తాకి గౌరవం చూపిస్తానని.. ఎందుకంటే ఆమె మేల్కొని ఉంటే అలా చేయనివ్వదని

బెడ్ రూమ్‌లో భార్యతో అలాగే ఉంటా.. సంచలనంగా మారిన నటుడి కామెంట్స్..
X

దిశ, వెబ్ డెస్క్ : నటుడు రవి కిషన్ తన భార్య ప్రీతి శుక్లాపై ప్రశంసల వర్షం కురిపించాడు. తను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిందని.. తనకు అతిపెద్ద సపోర్టర్ తనేనని తెలిపాడు. అందుకే నిద్రపోతున్నప్పుడు భార్య పాదాలను తాకి గౌరవం చూపిస్తానని.. ఎందుకంటే ఆమె మేల్కొని ఉంటే అలా చేయనివ్వదని చెప్పాడు. “నాకు డబ్బు లేదు.. అలాంటి సమయంలో ఆమె నా వెనుక నిలబడింది. ఇవాళ నేను సాధించిన విజయం ఆమెదే” అని తన సక్సెస్ క్రెడిట్స్ భార్యకు ఇచ్చాడు. 1993 నుంచి ఇప్పటి వరకు.. మూడు దశాబ్దాలకు పైగా వారి మధ్య ఉన్న బలమైన బంధాన్ని గుర్తుచేసుకున్నారు.

విజయం తలకెక్కినప్పుడు.. ప్రీతి తనను బిగ్ బాస్‌లో చేరమని ప్రోత్సహించిందని చెప్పాడు రవి కిషన్. అది తనను బ్యాలెన్స్ చేస్తుందని ఆమె భావించిందని తెలిపాడు. ‘నేను కాస్త పిచ్చిగా మారుతున్నానని అనుకుంది... మూడు నెలల పాటు బిగ్ బాస్‌లో బంధించింది’ అని అన్నాడు. ఆమెను భార్యగా పొందడం జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపిన ఆయన.. వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలకు కీలకమైన శక్తిగా అభివర్ణించాడు.

Next Story