- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'రణబాలి'పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన రష్మిక
'రణబాలి'లో ఓ కీలక సన్నివేశం కోసం విజయ్ దేవరకొండ, డైరెక్షన్ టీమ్ తీవ్రంగా శ్రమిస్తున్నారని రష్మిక మందన్న వెల్లడించింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'రణబాలి' చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా రష్మిక మందన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
ఒక సీక్వెన్స్‌కు సంబంధించిన విజయ్ దేవరకొండ ఫోటోను షేర్ చేస్తూ, "ఈ ఫోటోను నేను షేర్ చేయవచ్చో లేదో తెలియదు. దీన్ని తీసేయమని చెబుతారేమో కూడా తెలియదు. కానీ విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్, మొత్తం డైరెక్షన్ టీమ్ ఒక సీన్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఆ సన్నివేశాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఈ విషయాన్ని చెప్పకుండా నేను అస్సలు ఉండలేకపోయాను" అని పేర్కొంది. రష్మిక చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో 'రణబాలి' సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.






