- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కళ్యాణ్‌తో అలాంటి ఫొటో.. రాశీ ఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బ్యూటిపుల్ రాశీ ఖన్నా తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమలో బిజీబిజీగా గడుపుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో వరుస అవకాశాలు అందుకుంటోంది. 2025 తనకు సూపర్ సక్సెస్ ఇవ్వగా.. ఈ ఏడాదికి సంబంధించిన కొన్ని విశేషాలను ఓ ఇంటర్వ్యూలో తెలిపింది

దిశ, సినిమా : బ్యూటిపుల్ రాశీ ఖన్నా తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమలో బిజీబిజీగా గడుపుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో వరుస అవకాశాలు అందుకుంటోంది. 2025 తనకు సూపర్ సక్సెస్ ఇవ్వగా.. ఈ ఏడాదికి సంబంధించిన కొన్ని విశేషాలను ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇందులో భాగంగా అనుకోకుండా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన బ్యూటీ.. ఏ రోజు తన కోయాక్టర్‌ను సెల్ఫీ గురించి ఇబ్బంది పెట్టాలని అనుకోలేదని తెలిపింది. అయితే షూటింగ్ పూర్తయిన రోజు.. ఆయనే చెప్పారు తనతో ఫొటో తీసుకోమని.. దీంతో తాను వావ్ అనుకుని.. వెంటనే ఫోన్ తీసి.. ఆయనతో సెల్ఫీ తీసుకున్నానని.. ఇందుకు సంబంధించిన ఫొటో చూపించింది. చాలా నైస్ కదా.. ఆ ఆనందాన్ని మాటల్లో వివరించలేనని తెలిపింది. ఇక ‘గబ్బర్ సింగ్’ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషనల్ వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో మరో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సినిమా నుంచి విడుదలైన ‘దేఖ్‌లేంగే’ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది.






