Rana: ఇది చాలా అరుదైన సినిమా.. ఇలాంటివి జీవితంలో ఒక్కసారే వస్తాయి.. వైరల్‌గా రానా కామెంట్స్

by Chukka Sudharani |

దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా ‘కాంత’.

Rana: ఇది చాలా అరుదైన సినిమా.. ఇలాంటివి జీవితంలో ఒక్కసారే వస్తాయి.. వైరల్‌గా రానా కామెంట్స్
X

దిశ, సినిమా: దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ కాగా.. రానా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. దుల్కర్‌ సల్మాన్‌ ‘వేఫేర్‌ ఫిలిమ్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్‌ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్‌కి సిద్ధం అవుతున్న ఈ చిత్రంపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు రానా. ‘ఇది కంప్లీట్‌గా ఫిక్షనల్ కథ. ఇప్పుడు స్టూడియోలో ఏదైనా జరిగితే ఇమ్మీడియట్‌గా అందరికీ తెలిసిపోతుంది. కానీ ఇలాంటి కథలు చాలా జరిగాయి. చాలా తక్కువ మందికి తెలిసేవి. ఆ కాలం నుంచి ఇన్స్‌పిరేషన్ పొంది రాసిన కథ. ఇది ఒక ఇన్సిడెంట్ అని చెప్పలేం. డార్క్ సైడ్ ఆఫ్ గ్రేట్ పీపుల్ అని చెప్పొచ్చు. ఒక ఇద్దరు గొప్ప వ్యక్తులు వాళ్ళ ఆర్టిస్ట్ బ్రిలియన్స్ కోసం గొడవలు పడిన నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

50s బ్యాక్ డ్రాప్‌ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే.. ఆ కాలంలో లిటరేచర్, మ్యూజిక్‌కి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది. ఈరోజు షార్ట్ కాంటెంట్‌లో ఉన్నాం.. ఏ మ్యూజిక్ ఏ సాహిత్యమైన ఓకే అన్ని సర్దుకుపోతున్నాం. కానీ ఆ కాలంలో అలా ఉండేది కాదు. పర్ఫెక్షన్ ఉండేది. ఆ టైంలో జరిగిన కథ అంటే తెలియని రొమాన్స్ వస్తుంది. కాంత నా కెరియర్లో చాలా స్పెషల్ ఫిలిం. ఇలాంటి సినిమాలు జీవితంలో ఒకేసారి వస్తాయి. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ని మళ్ళీ మళ్ళీ రీ క్రియేట్ చేయలేం. నేను కథ విన్న వెంటనే కచ్చితంగా సినిమా చేయాలనుకున్నాం. కాంత సినిమాని రియల్‌గా సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. ఇందులో ఉండే డ్రామా ఎమోషన్ అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి సినిమా ఒకేసారి వస్తుందని భావిస్తున్నాను. ఇది చాలా అరుదైన సినిమా. ఆడియన్స్ థియేటర్స్‌లో చాలా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ చేస్తారు. ఈ సినిమా పైన చాలా నమ్మకం ఉంది’ అని తెలిపారు.


Next Story